Sundareez petit musings !!!!

Monday, January 07, 2013

చిదంబర రహస్యం


చిదంబర రహస్యం

మేము ఈ మధ్య పాండిచేరి వెళ్ళాం. Ofcourse, ప్లాన్ ప్రకారం నేను మా చిన్న చెల్లి - లాస్య, వెళ్ళాలి అనుకోండి. కాని మా అమ్మ, నాన్న, అసలు సిసలు చెల్లి - సౌమ్య,  ఫాలో అయిపోయారు - నిన్ను వదిలి మేము ఉండలేములే - అది నిజములే అన్నలెక్కలో అన్నమాట. మరి, పాండిచేరి లో ఒకటే గుడాయే, మా అమ్మ కి తనివి తీరదు కదా, అలా మచ్చుక్కి రెండు మూడైనా చూసేయ్యాలి కదా , మీరు మరీను... అర్ధం చేసుకోరు!

So , 'ఛలో చిదంబరం' అని ప్రయాణం కట్టాం ఒక రోజు పొద్దున్నే. పాండిచేరి నించి ఒక 90 kms దూరం అయినా, మా డ్రైవరు 'నిదానమే ప్రధానం' అన్న principle follow అయిపోయి , చక్కగా మమ్మల్ని నిండు మనుషులుగా చేర్చాడు, ఒక 2 ఘంటల్లో. నాకు ఎప్పట్నించో కుతూహలం, అస్సలీ చిదంబర రహస్యం ఏంటి చెప్మా అనీ !! అంటే, చాలా మంది first hand information ఇచ్చారనుకోండి, but still మనం experience చెయ్యందే నమ్మం కదా ...

గుడి entrance లో 3 పేద్ద రధాలున్నై, నటరాజా స్వామి వారు ఊరేగుతారన్నమాట , కామేశ్వరి దేవి తో. ఆహా, నా పేరు తో ఉన్న అమ్మవారని, మాయమ్మ మురిసిపోతూ, lead చేసేస్తోంది మా అందరిని. అంటే, మా అమ్మ కి partiality అనుకునేరు, లేదు సుమీ. ఏ గుడి ఐనా సరే, దండి మార్చ్ అని lead చేసేస్తుంది. అంటే, పాపం గాంధీ మహాత్ముడైనా, కాస్త వెనక్కి తిరిగి చూసుంటారు, మా వాళ్ళు ఉన్నారా అని. కాని, మా అమ్మ కి ఘాట్టి నమ్మకమో లేదా ఘాట్టి పరాకో తెలీదు కాని, సై మని దూసుకుపోతుంది rocket లాగా .. so , గుడి దెగ్గర మాత్రం role reversal జరుగుతుందన్నమాట , మా అమ్మ leader - మా నాన్న follower !

ప్రధాన ద్వారానికి చక్కటి శిల్పాలు చెక్కి ఉన్నాయ్. నాకు, వీటి మీద ధ్యాస ఎక్కువాయే , దాంతో నేను కాస్త వేనేకపడి పోయా. ప్రధాన వాకిలి enter అవుతూనే చాలా కూలాహలం కనిపించింది. నాకు red antenna లు అలెర్ట్ అయ్యాయి, ఏదో విశేషం జరగబోతోందని sixth sense ఘాట్టిగా డంకా కొట్టి మరీ చెప్పింది. సరే చూద్దాం అనుకుంటూ ముందుకి నడిచా. ఈ గుడి లో విశేషం ఏంటంటే, అయ్యవారు వాకిలి ని face చెయ్యటం లేదు. ప్రదక్షిణ ద్రోవలో వెళ్తే  అర్ధమయ్యింది, అయ్యవారి వామ హస్తం మేము enter అయిన వైపుందని. అక్కడ ఏదో అభిషేఖం జరుగుతోంది, మంటపం లో ఉత్స విగ్రహానికి. అది కొంచం సరిగ్గా కనిపించాలంటే, పక్కన ఉన్న మంటపం ఎక్కితే కనిపిస్తుందని అటు వైపు వెళ్ళాను. మా వాళ్ళు మాత్రం కిందనే నించుని చూస్తున్నారు. మంటపానికి మెట్లు ఎక్కుతుంటే ఎదురుకుండా నటరాజ విగ్రహం కనిపించింది, అయ్యవారు చిన్నగా ఉన్నారు, నాకు తోచలేదు, ఎందుకో అది చాలా పెద్ద విగ్రహం ఉంటుందని  ఊహించుకున్నా, so maybe ఇది అయ్యి ఉండదు అనుకుంటూ మెట్లెక్కి ఉత్స విగ్రహాన్ని తొంగి చూడటానికి ప్రయత్నం చేశా. ఆ మంటపం కప్పు చాలా కిందకి ఉంది, and బోల్డు స్తంభాలాయే. కాసేపయ్యాక గ్రహించా ఎదురుకుండా గోవింద రాజ స్వామి వారు విశ్రమించి ఉన్నారు. ఒక చోట నించే ఎడమ వైపు శయనించిన గోవిందరాజ స్వామి , ఎదురుగా ఉత్సాహం గా తాండవం ఆడుతున్న నటరాజ స్వామీ. ఎప్పుడూ చిందులు తొక్కుతూ ఉండేవాడు, చిన్మయ వదనం తో ఆనంద తాండవం ఆడుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు కదా, అందుకని నేను ఫ్రంట్ రో లో పడుకుని మరీ చూస్తానర్రోయ్ అనుకుంటూ, ఈయన తాండవం చూసి ఆయన ఆనందిస్తున్నాడా అనిపించింది. Amazing structural design !

ఈ లోపు, మరి లోపలేముందో అని తొంగి చూస్తే , అక్కడ ఇంకో magical step వేస్తున్న నటరాజ స్వామి. ఆయన ఎదురు కుండా, అమ్మవారు సిగ్గు పడుతూ.

సరే, మన expedition కానించి మా వాళ్ళ దెగ్గరకి వెళ్ళా. వింతగా, అంత గుంపులో గోవిందా అనకుండా, అందరూ కనిపించారు. కాసేపయ్యేసరికి, కల కలం. అభిషేకం అయిపోయిందట ఇక దర్శనం కివదుల్తున్నారని తెలిసింది. మా చెల్లి వెళ్లి అందరికి టికెట్లు తెచ్చింది. రైటో అనుకుంటూ అందరం క్యూ కట్టాం. ఇప్పుడు దర్శనానికి అయ్యవారి కుడి వైపు నుంచి enter కావాలన్నమాట. అక్కడ , 5 మెట్లు - వాటిని పంచాత్చర పది అని అంటారని తర్వాత తెలిసింది. అక్కడో యమ strict ద్వార పాలకుడు నుంచుని ఉన్నాడు. తలుపులు తెరుచుకున్నాయి, మేము ఐదు గురం ఒకళ్ళని ఒకళ్ళు అంటుకున్నామా అన్నట్టు అతుక్కుపోయాం. Ofcourse , అమ్మ gang leader as usual . కాని నాకు తెలీని విషయం ఏంటంటే.. అబ్బే ఇప్పుడే suspense reveal చెయ్యడం ఎందుకులెండి..

ద్వారం తెరుచుకుంది.. మాకు అయ్యవారి పిలుపు వచ్చింది. ఒక queue system లేక పోవడం వల్ల, మమ్మల్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయారు . సగం space ఈ ద్వార పాలకుడే occupy చేసేసాడు, queue లు మాత్రం రెండు form చేయించాడు. సరే, ఏదో నెట్టుకుంటూ తిట్టుకుంటూ తోసుకుంటూ నడుచుకుంటూ మేట్లేక్కం మూకుమ్మడిగా . అమ్మ sanctum sanctorum లోకి enter అయ్యింది , next నా అసలు చెల్లి , తర్వాతా నాన్న, నేకేస్ట్టు  లాస్యా దేవి, ఫైనల్ గా నేను వెళ్ళడమే తరువాయి. కాని, అమ్మ వెళ్తూనే తలుపులు మూసుకు పోయాయ్, ధడేల్మని. మాకేమో అయోమయం గందరగోళం !! టైం అయిపోయి మూసేసాడా ఏంటి అని అర్ధం కాలేదు. మా చెల్లి ఒక పొలి కేక - 'అక్కయ్యా, వాడితో అరవం లో రవించు' -simple గా అరవం లో ఏడు అని అన్నమాట. మా ఫ్యామిలీ whole & sole కి ,మా అమ్మ అరవం లో దంచితే, నేను కాస్త ఏడ్చి పెడతనన్నమాట.  అంటే లాస్యా దేవి బాగా పాడ గలదు కూడా అనుకోండి, కాని మా చెల్లి కి ఆ ధ్యాస రాలేదు. నేను అతుక్కుంటూ అడిగా,' ఏంటయ్యా నీ గోడు' అని. 'మీరు వెళ్ళేది లేదన్నాడు'. పక్కన వాళ్ళని రమ్మన్నాడు. మా నాన్న మెల్లగా net  practise చేస్తున్నారు, అవసరం అయితే బరిలోకి దిగుదామని. అది చూస్తూనే మాకు చెమటలు పట్టటం మొదలయ్యాయి. ఎందుకంటే మా నాన్న కొడితే sixer ఏ!!

మళ్ళి కూడ పలుక్కుని దబాయిస్తే,'ticket లేందే వదిలేది లేదు పొమ్మన్నాడు. మా చెల్లి కేసి చూస్తే, అమ్మ దెగ్గర ఉన్నాయంది . ఇంకెక్కడి అమ్మ!! మా చెల్లి, ఆర్తనాదం మొదలెట్టింది - 'అమ్మా అమ్మా ' అని... 'అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా' అన్న లెక్క  లో రాగాలు తియ్యడం మొదలెట్టింది.. నేను 'ఆ లావుపాటి మామి దేగ్గరున్నయాయ్యా బాబు' అంటున్నా..నాన్న కి మెల్లగా పూనకం వస్తోంది..లాస్య విస్య్మయం లోకి వెళ్లిపోయింది.. సౌమ్య, లాభం లేదని మళ్ళి వాడికి ఆగ్లం లో చెప్పటానికి ప్రయత్నం చేస్తోంది..నేనేమో, 'అసలావిడ చేతిలో ticket లు పెట్టకూడదని తెలియదేంటే బాబూ' అని సన్నుక్కుంటున్న .. ఒక క్షణం, మేమంతా వైకుంట ద్వారం దెగ్గర ఉన్నట్టు.. మా అమ్మ తన్మయత్వం చెందిన భక్తి తో, శివ శివా - నాకు ఈ భవ బంధాలతో ముక్తి కలిగించు అనుకుంటూ లోపలికి వేల్లిపోయినట్టు, శివుడు - తధాస్తు అని ద్వారం మూయించేసినట్టు .. మేము లవ కుశు ల్లా - సీతా దేవి భూమాతతో వెళ్లిపోతుంటే గుండె పగిలి విలిపించిన తీరులో, రోదిస్తున్నాటు అనిపించింది . వైకుంటం ఏంటి - శివుడేం టి - మళ్ళి లవ కుసులేంటి , అని అడక్కండి - ఏదో ప్రాసకి వాడేసా. 

ఆ ట్రాన్స్ లోంచి, మా నాన్న పులి కేక బైటకి తీసుకోచ్చింది. మా నాన్న,  వాడికి అర్ధం అయ్యేలా, వాడి బుర్రకేక్కేలా తిట్టాలంటే ఆంగ్లం ఒకటే శరణ్యం అని decide అయిపోయి, మూడో కన్ను తెరిచారు  - ప్రళయ తాండవం ఆడటం మొదలు పెట్టారు - ఆంగ్లం లో ఆయనికి ఆయనే పదాలు పడేస్తున్నారు - పాడేస్తున్నారు..... 'Why will we lie , at a temple ? Do I look like a lier ? You will suffer , you  will die a horrible death for not letting us have darshan of the God ' ...మా చెల్లి సమాధాన పరుస్తోంది, 'నాన్న, వద్దు ..cool down ..మళ్ళి వద్దాం . ఈ సారి ప్రాప్తం లేదనుకో ...వద్దు అరవకు', అని..మేము నిరాశతో ఇక ఈ సారికి ఇంతే భాగ్యం అనుకుని మెల్లగా వెనకడుగు వేశాం . ఇంతలో ఒక వింత జరిగింది . ఇదంతా విని ఎక్కడో దూరం నించి ఒక ఆయన వచ్చారు మా దెగ్గరికి , 'ఏమిటమ్మా పెద్దాయన ఎందుకు ఆవేశ పడుతున్నారు ' అని అడిగారు. నేను, మా చెల్లి ఆంగ్లం లో రోదించాం . 'అవునా, నేను ఉన్నాను కదా - ఆరాట పడకండి, నేను ఇప్పిస్తా మీకు దర్శనం ' అని నవ్వాడు. ఆ ద్వారపాలకుడి వైపు చూసి, 'వీళ్ళని వెల్లనీ' అన్నాడు. వాడు, 'సరే రండి' అన్నాడు. 

నాకు సాక్షాత్తు పరమ శివుడు వచ్చి, నందికి - వీళ్ళని రానీ వోయ్  అన్నట్టనిపించింది.చేతులెత్తి మనసారా నమస్కరించాను. ఒక క్షణం ఆయన లోనే దేవుడు కనిపించాడు. నాకన్నా కూడా, నాకు మా నాన్న దర్శనం miss  అవుతారని బాధ. am sure , మా చెల్లి కూడా అంతే feel అయ్యి ఉంటుంది . ఈ మధ్యనే తిరువన్నామలై వెళ్దాం అని 2 నెలల ముందు నుంచి plan చేసుకుని, అనుకోని తీరులో train, life లో first time miss అయ్యి వెళ్ళలేక పోయారు. ఆ shock నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. మళ్ళి ఇప్పుడు ఈ twist ఏంట్రా బాబు అని అనుకుంటూ ఉన్నా, ఈ లోపు ఆ miracle అలా జరిగిపోయింది. మళ్ళి ఎక్కడ మా నాన్నఉడుకుమోత్తనంతో, 'నేను రాను మీరు పొండి', అంటారేమో అని మెల్లగా ఆయనకి నచ్చ చెప్పి మెట్ట్లే క్కించాం  - 'శివాయ నమః ' !! మళ్ళి ఒకసారి ఆయన వైపు చూసి, చాలా thanks అని దండం పెట్టి లోపలి కి నడిచా . 

లోపలి కి వెళ్ళాక లాస్య మా అమ్మ కోసం చూడటానికి ప్రయత్నం చేసింది, నేను నవ్వి - 'ఓసి పిచ్చి పిల్ల, నీకు ఇంకా అర్ధం కానట్టుంది. మా అమ్మ కి నిజంగా మన గురించి పడితే, బైట ఇంత భాగోతం జరుగుతున్నప్పు డే ఒక సారైనా తొంగి చూసుండేది. ఆవిడ గురించి మరిచి పో . ఈ గుంపు లో, ఈ అంధకారం లో, మనకి కనిపించి ఛాన్స్ లేనే లేదు. trust me , మనం బైటకి వెళ్ళిన ఒక 15 నిమిషాల తర్వాత తను వస్తుంది. నువ్వు దేవుడి దర్సనం చేసుకో' అని ఏదో పెద్దతలకాయ్ లెక్కలో బుధ్ధి చెప్పా. అంతగా ఏం కనిపించలేదఅనుకోండి మాకు. ఇంకా, అభిషేకం అప్పుడే  చక్కగా కనిపించాడు స్వామి. ఒక 5 నిమిషాల తర్వాత మమ్మల్ని ఇందాక కరుణించిన అయ్యాన వచ్చి, 'అందరూ ఉన్నారా అని కుశలం కనుక్కుని, బైట కి వెళ్ళిన తర్వాతఫలానా చోట నించో డి , నేను ప్రసాదం తీసుకుని వస్తా' అని వెళ్ళిపోయారు. మేము కూడా, ఇంక 5 నిమిషాలకి సద్దుకుని బైట పడ్డాం. మళ్లీ బైటికి వచ్చి కాసేపు మా అమ్మ కనిపిస్తుందేమో అని చూసాం. మాకంటే కనీసం 5 నిమిషాల ముందర వెళ్ళినా, ఇంకా బైటికి రాలేదు. అప్పటికే 12 అవపోతోంది , గుడి మూసేసే time అవుతోంది. నేను already ఇందాక కొన్ని గుళ్ళు చూసా కాబట్టి , మా చెల్లిని నాన్నని వెళ్లి చూసి రమ్మని చెప్పి పంపించా. లాస్య నా తో నే ఉండి పోయింది. తను ఇంతక ముందు వచ్చింది కాబట్టి, చూడక పోయిన పర్వాలేదు అని skip చేసింది . 

మా చెల్లి, నాన్న వెళ్లి అన్నీ చూసి వచ్చినా మా అమ్మ జాడ మాత్రం తెలియదాయె. సరే, మేము turns వేసుకుని కాచుకున్నాం. ఈ సారి, నేను లాస్య ఇంకో వైపు ఉన్న ప్రాంగణ చూసి వచ్చాం. ఇంకా మా అమ్మ జాడ లేదు. సౌమ్య, నాన్న ఇంకా అక్కడే ఉన్నారు. ఇంత సేపు లోపల ఏం చేస్తోంది చెప్మా, అనుకుంటూ వెళ్ళి మా చెల్లిని వెళ్ళి అదే మాట అడిగేసా. 'అదేంటి, మీరు అటు వెళ్ళారు , మీ వెనకే బైటికి వచ్చింది - మీరు అటు వెళ్ళారంటే , నేను చూస్తానని బయల్దేరింది మీ వెన్నంటే. మీకు కనిపించలేదా?' లాస్య మళ్ళిఈ సారి ఆంగ్లం లో విస్మయం చెందింది. 'How does she do it ? How does she manage to disappear ? ' అనుకుంటూనే వెనక నుంచి ప్రత్యక్షం అయ్యింది, మా అమ్మ, నవ్వుకుంటూ. చిన్న పిల్లలు తప్పు చేసి, ఎక్కడ అమ్మ కొడుతుందో అని, ఒక innocent smile పడేస్తారు చూడండి అలా అన్నమాట. మా దెగ్గరికి వచ్చి , 'అవునే మీరిద్దరూ ఎటు వెళ్ళారు, కనిపించలేదు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి చక్కగా శివుడి మీద పాటలు పాడుతోంది', అని మళ్ళి giggle చేసింది. లాస్య, మళ్ళి అదే 'How ' ప్రశ్నలు. అది తర్వాత. మనం అందరం ఇక ఇక్కడ్నించి చిత్తగిం చడం మంచిది, పడందహో అని బయల్దేరం. కాని నేను ఉండపట్టలేక అడిగేసా, కడిగేద్దాం అనుకున్నా కాని control చేసుకుని, 'అమ్మా నాన్న ఎంత upset అయ్యారు తెలుసా, అంత పని చేసావ్.' అని snub చేయ్యపోతే ఆవిడ response విని అదిరిపడ్డం. ఆ మరీను, చోద్యం. నేను ticket తీసుకెళ్ళా నే అనుకో, మీరు ఇంకో 4 కొనుక్కుని ఏడవచ్చుగా. దేవుడి దేగ్గరెంటి మీ పిసినారితనం. ఆ 200 హుండీ లో వేసామనుకుంటే పోయే అని చాళుక్కు విసిరింది. ఆహా , ఏమి presence of mind - మాకెందుకు తట్టలేదో, ఐనా తప్పు చేసి అది మా మీదే విసిరేసే తెలివితేటలూ - అవి చూసి మురుసిపోవాలా - కోపగిం చుకోవాలా . అయినా ఇలా వదిల్తే మళ్ళి నేర్చుకోదని , 'ఇంకో సారి ఇలా చేసావా నిన్ను వదిలిపెట్టి వెళ్ళి పోతాం జాగ్రత్త, హమ్మా ' అనేసా . మళ్ళి దానికింకో చెమక్కు response విసిరి తుర్రుమంది 'ఆ, నన్నొదిలి పోతే మీకు ఎవరు వందిపెడతారు'.. ఈ సారి మేమందరం హాచర్యం తో  'How ' అని ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నాం.

1 Comments:

At 10:35 AM, Blogger నళినీ కాన్త్ said...

Very humourous and funny. Of course with such a diverse cast as Aamma, pedananna, you and sowmya akka, your "play" id bound to be like this.

 

Post a Comment

<< Home